మరో విషవాయువు మృత్యుహేల!
పారిశ్రామిక సంస్థలపై కన్నేసి ఉంచాలి

ఘోరం! మానవుని తప్పిదం మరోసారి అమాయకులను బలిగొన్నది! విశాఖపట్నంలోని ఎల్.జి. పాలిమర్స్ సంస్థలో మానవ తప్పిదం వల్లనే మరోసారి అక్కడి విషవాయువు- ఈ వ్యాసం రాసేసరికి 11 మందిని బలిగొన్నది! భోపాల్‌లో! కాని,
1984 డిసెంబరు 2వ తేదీన భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ సంస్థ నుంచి వెలువడిన విషవాయువు వల్ల మొత్తం 2260 మంది మృత్యువాత పడ్డారన్నది అధికార అంచనా అయితే, కాదు 15వేలు దాటిందని ఒక అంచనా, కాగా, అది 20వేలు దాటిందని మరో వాదం!
అదృష్టం! భగవత్కృపవల్ల విశాఖలోని ఎల్‌జి పాలిమర్స్ సంస్థ వెదజల్లిన విషవాయువ్ఞ వల్ల 11 మంది మరణించగా, దాదాపు 350 మంది భయంకర పరిస్థితిలో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
యాజమాన్యం నిద్రపోతున్నది!
ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టైరీన్ విషవాయువు లీకేజీ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఆ సంస్థను దేశంలో లాక్‌డౌన్ వల్ల గత 40 రోజులుగా మూసివేశారు. ఈలోగా దాని అతీగతి కనుక్కోకుండా యాజమాన్యం వదిలివేసిందని అంటున్నారు. స్టైరీన్ విషవాయువ్ఞ ఉష్ణోగ్రత ఎప్పుడూ 20 డిగ్రీల వద్దనే వ్ఞండాలట. అయితే, యాజమాన్యం ఆ విషయం పట్టించుకొనకపోవడం వల్ల టాంకులో పేరుకున్న స్టైరీన్ వాయువు వల్ల ఒక్కసారిగా టాంకు బద్ధలై బయటకు విరుచుకుపడిందంటున్నారు.
అరుణ కుమార్‌కు జేజేలు
అందుచేత, తప్పు ఎల్.జి. పాలిమర్స్ సంస్థదేనంటున్నారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ అనే యువకునికి విశాఖవాసులు కృతజ్ఞ్ఞత చెప్పాలి.
గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు విషవాయువు లీకేజి ప్రారంభం కాగా, ఆ యువకుడు ఇది కనిపెట్టి, 3.25 గంటలకు విశాఖ పోలీసు కంట్రోలు రూమ్‌కు ఫోన్ చేశాడు! ఈ దుర్వార్తను వినగానే ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం హుటాహుటిన వెళ్లడం, విషవాయువుబాధితులకు కోటి రూపాయల సహాయం ప్రకటించడం ప్రశంసనీయం.
భోపాల్ దుర్ఘటనకు బాధ్యురాలైన ఆ సంస్థ యాజమాన్యాన్ని భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వదిలిపెట్టలేదు. అలాగే ఎల్.జి పాలిమర్స్ సంస్థ యాజమాన్యాన్ని కూడా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత సులభంగా వదిలిపెట్టకూడదు.
అంతేకాదు ఇలా అజాగ్రత్త, అశ్రద్ధ వల్ల విషవాయువులు వెదజల్లడానికి అవకాశమున్న పారిశ్రామిక సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిత్యం ఒక కన్నువేసి వుంచడం అవసరమనడానికి భోపాల్, విశాఖ ఉదంతాలే నిదర్శనం.
-డాక్టర్ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ అవార్డు గ్రహీత)
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం :https://www.vaartha.com/specials/health1/