వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు
ప్రజల మధ్య చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారు

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళన చేసేందుకు గత సంవత్సరం విశాఖపట్టణంకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు నుంచి ఏ చట్టం కింద తిప్పి పంపించారని వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏం చట్టం కింద నన్ను వెనక్కు పుంపుతారని చంద్రబాబు బట్టలు చించుకుంటున్నాడని ఎంపీ విమర్శించారు. ప్రజల మధ్య విషబీజాలు నాటే వారిని వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు అని అన్నారు. ఏడాది కిందట స్పేషల్ స్టేటస్ కోరేందుకు ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ గారిని ప్రజా ప్రతినిధులను ఏ చట్టం కింద ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపావు చంద్రబాబు అని ప్రశ్నించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/