అమెరికాలో జాతి వివక్షపై గళమెత్తిన కవయిత్రి

అమెరికాలో జాతి వివక్షపై   గళమెత్తిన కవయిత్రి
Ramya Ramana

ఈ తరం యువతలో కవిత్వం రాసే వారు ఉన్నారంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. అలా అరుదుగా చెప్పుకునే వారిలో ఒకరు రమ్యారమణ. కవితాప్రియులకు రమ్యారమణ ఒక వేగుచుక్కలాంటివారు. అమెరికా వంటి దేశంలో అక్షర చైతన్యాన్ని వెదజల్లుతున్న రమ్యారమణ న్యూయార్క్‌ ఆస్థాన కవయిత్రిగా ఎంపికైనారు. విదేశంలో ఆస్థాన కవయిత్రిగా ఎంపికైన తెలుగు యువతిగా ఆమె మంచి గుర్తింపు పొందారు. మహిళల హక్కులు, జాతి వివక్షలపై కళం గళం ఎక్కుపెట్టిన ఆ యువ కెరటం అందరికీ స్ఫూర్తిదాయకం.
అమెరికా దేశంలో ట్రంప్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళల హక్కులకు భంగం కలిగించే పాలసీలను చేసింది. స్త్రీల హక్కులకు రక్షణ లేకుండా పోయింది. ఇది దురదృష్టకరం. కొత్త ప్రభుత్వం రాకతోనే అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు, మహిళల మీద ఎలాంటా ప్రభావం ఉండబోతోందన్న ఆందోళన కలుగుతోంది. ఎక్కడ చూసినా జనం నిలదీస్తున్నారు. సంఘంలో ఎన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా.. ట్రంప్‌ ప్రభావాన్ని మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. ప్రజందరి మధ్య చర్చ కొనసాగుతున్నది. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అందరిలాగే నేను కూడా అన్వేషిస్తున్నాను. విజ్ఞులను ఆలోచింపచేసేందుకు కవిత్వాన్ని ఆశ్రయించానంటుంది రమ్యా రమణ. అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి కవిత్వాన్ని తాను ఆయుధంగా ఎంచుకున్నారు. సామాజిక సమస్యలు, మహిళల హక్కులు, చైతన్యశీల అంశాలను కవితావస్తువులుగా చేసుకుని కవిత్వం రాయడం రమ్యా పని. న్యూయార్క్‌ రాష్ట్రానికి యువ ఆస్థాన కవయిత్రిగా ఎంపికైన రమ్యారమణ తల్లిదండ్రులు ఇద్దరు తమిళనాడులోని రాజాపాలెయంకు చెందిన వారు. వారి తొలినాళ్ల జీవితం అక్కడే గడిచింది. అమ్మ పేరు విద్య, నాన్న పిల్లయార్‌ రమణబాబు. వీరిది తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబం. వీరి బంధువులంతా తెలుగు వాళ్లే. ప్రస్తుతం న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. అయితే ఇంట్లో తెలుగు భాషకే ప్రాధాన్యనిస్తారు. తమిళనాడులోని రాజాయపాలెయం లో అమ్మమ్మ దగ్గర పది నెలల పాటు ఉన్న రమ్యాపై అమ్మమ్మ ప్రభావం చాలానే పడింది. ఆమె చిన్న ప్పటి నుంచే కర్ణాటక సంగీతం, భరతనాట్యం నేర్చుకు న్నారు. న్యూయార్క్‌లో తెల్లవారి మధ్య పెరిగి పెద్దయింది. అక్కడి వారి లో ఒకందరు తన రంగు, వ్యవహారం చూసి హేళన చేసిన సందర్భాలు ఆమెను కలచివేసాయి. వాళ్లలా ఉంటే ఏడిపించరు అనుకుని అలా ఉన్నప్పటికీ వారిలో మార్పు రాలేదంటుంది. ఆమె ఎదుర్కొన్న జాతి వివక్షను తనను ఎంతో బాధించిందని చెపుతుంది. పెద్దయ్యాక అలాంటి పరిస్థితులు ఎదుర్కోకపోయినా ఇంకెవ్వరూ తనలా బాధపడకూడదన్నది ఆమె ఆశయం. దాని నుండే కవిత్వం పుట్టింది. మనసులోని భావాలను కవిత్వీకరించడం ఒక కళ.ఆ కళకు నగిషీలు చెక్కే తర్ఫీదు కూడా అవసరం. అమెరికాలో పొయెట్రీ ప్రియులకు శిక్షణ అందించే సంస్థలు బోలెడు ఉన్నాయి. రమ్యా అర్బన్‌ వర్డ్‌ న్యూయార్క్‌ సిటీ అనే సంస్థలో చేరారు. అక్కడ చేరి కవిత్వానికి మెరుగులు దిద్దుకున్నారు. అక్కడే తనకంటూ ఓ ప్రత్యేక మైన గుర్తింపును కూడా సాధించారామె. అక్కడ స్థిరపడిన భారతీయుల్లో చాలా మంది రకరకాల కెరీర్‌లను ఎంచుకుంటుంటారు. కానీ తాను మాత్రం కవిత్వాన్నే కెరీర్‌గా ఎంచుకున్న భిన్నమైన వ్యక్తిగా ఉన్నారు రమ్యారమణ. అలా అని తానూ ఊహించలేదు. నిక్స్‌్‌ పొయెట్రీ స్లామ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నందుకు చదువుకు అవసరమైన డబ్బు అందించింది ఆ సంస్థ. రమ్యారమణ ప్రస్తుతం న్యూయార్క్‌లోని సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీలో ఫిలాసఫీ, గవర్నమెంట్‌ అండ్‌ పాలిటిక్‌ చదువుతున్నారు. మిస్‌ అమెరికాగా ఎంపికైనప్పటికీ జాతి వివక్ష ఎదుర్కున్న విషయంపై రమ్యా కవితారూపాన్నిచ్చారు. ఆ కవితను పోటీల్లో వినిపించారు. శరీర వర్ణం వేరయినంత మాత్రాన అన్ని అర్హతలు ఉండి అందాలకిరీటాన్ని గెలుచుకుని కూడా జాతి వివక్ష ఎదుర్కోవడం అవమానకరమని, అది అమెరికాలో వేళ్లూనుకున్న ఆతి వైషమ్యానికి నిదర్శనమని అర్ధం చ్చేలా కవిత్వాన్ని రాశారు. దాంతో రమ్యా న్యూయార్క్‌ యువ ఆస్థాన కవయిత్రిగా ఎంపికైనారు. ఆ గౌరవం దక్కిన తొలి తెలుగు వ్యక్తి కావడం విశేషం. ఒక సంవత్సరం పాటు న్యూయార్క్‌ ఆస్థాన కవయిత్రిగా వేదికల మీద కవిత్వాన్ని చదవడం, ప్రదర్శనలు నిర్వహించదం చేసేవారామె. ఆమె రాసిన కవితలు ‘డోంట్‌ డ్రౌన్‌ హర్‌ ఇన్‌ ద బాప్టిజమ్‌ అనే పేరుతో ప్రచురించబడినాయి. తాను స్వయంగా కవితా జ్ఞానం చేస్తూ చేసిన ఒక అల్బమ్‌ను కూడా విడుదల చేయనున్నారామె. అమెరికాలో పాఠశాలలకు వెళ్లి అక్కడి పిల్లలకు కవిత్వం గురించి, స్త్రీ సాధికారత, జాతి వివక్ష, మానవహక్కుల గురించి బోధిస్తున్నారు. తమ విద్యార్థులల్లో కవితాచైతన్యం తీసుకొచ్చేందుకు రమ్మని ఆమెను చాలా దేశాలు ఆహ్వానిస్తున్నాయి.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/