అటవీ అధికారులు, పోడు రైతుల మధ్య ఉద్రిక్తత

farmers, forest officers
farmers, forest officers

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని గ్రామాల పరిధిలోనున్న అటవీభూములను చదును చేస్తున్న అటవీ, పోలీసు అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోడు భూమిలో మొక్కలు వేసేందుకు వచ్చిన అధికారులు ట్రాక్టర్లతో చదును చేయిస్తుండగా, పోడు రైతులు ట్రాక్టర్లను పోనివ్వకుండా అడ్డంగా పడుకున్నారు. దీంతో అధికారులు బలవంతంగా సుమారు 30 మంది రైతులను అరెస్టు చేసి ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/