టి కాంగ్రెస్ లో మరో వికెట్ పడబోతుందా..?

టి కాంగ్రెస్ నుండి ఇప్పటికే చాలామంది నేతలు బయటకు వచ్చి బిజెపి , బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, పోదెం వీరయ్య వీరు మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే లుగా ఉన్నారు. ఇక ఇప్పుడు వీరిలో ఒకరు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు జోరు అందుకున్నాయి.

తాజాగా పోదెం వీరయ్య ..బిఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి తో భేటీ అవ్వడంతో వీరయ్య కూడా కాంగ్రెస్ ను వీడుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరయ్య మాత్రం భద్రాచలం పట్టణాన్ని మూడు గ్రామ పంచాయితీలుగా విభజిస్తూ ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని రద్దు చేసి భద్రాచలంను మేజర్‌ గ్రామపంచాయతీగా గుర్తించి వెంటనే ఎన్నికలు జరపాలని మంత్రి దయాకర్‌రావును కోరడానికి కలిశానని చెప్పుకొస్తున్నారు.

అటు మంత్రి ఎర్రబెల్లి సైతం..వీరయ్య అందుకే కలిశారని చెపుతున్నారు. బయటకు మాత్రమే ఇలా వీరు చెపుతున్నారని..వీరయ్య బిఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగా వీరయ్య పార్టీ మారతారా..లేదా అనేది చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కాంగ్రెస్ ప్రభావం బాగా తగ్గింది. ముఖ్యంగా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతోంది. పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడం అటుంచి..నిత్యం ఉన్న కొద్దీ మంది నేతలే తరుచు గొడవలతో వార్తల్లో నిలుస్తుండడం తో ప్రజల్లో పార్టీ ఫై నమ్మకం పోతుంది. అందుకే ఉన్న కొద్దీ మంది నేతలు కూడా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నారు.