ఇన్ఫోసిస్ ఫౌండేషన్ విశ్రామ్ సదన్‌ను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM’s speech at inauguration of Infosys Foundation Vishram Sadan at Jhajjar Campus of AIIMS New Delhi

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లోని ఝజ్జర్ క్యాంపస్‌లో ఉన్న నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ వద్ద నిర్మించిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ విశ్రామ్ సదన్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..విశ్రామ్ సదన్ భవనాన్ని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నిర్మించిందని, విద్యుత్తు, నీరు, భూమి కోసం అయ్యే ఖర్చులను ఎయిమ్స్ భరించిందని చెప్పారు. సుధా మూర్తి బృందాన్ని, ఎయిమ్స్ మేనేజ్‌మెంట్‌ను అభినందించారు. ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి దేశంలోని కార్పొరేట్, ప్రైవేటు రంగాలు, సోషల్ ఆర్గనైజేషన్లు నిరంతరం కృషి చేస్తున్నాయన్నారు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 806 పడకల విశ్రామ్ సదన్‌ను నిర్మించింది. కేన్సర్ రోగులకు పరిచర్యలు చేయడానికి వచ్చేవారికి ఏసీ వసతిని ఇక్కడ కల్పిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/