జాతీయవాదమే బిజెపికి గుర్తింపు

ram madhav
ram madhav,


త్రిపుర: బిజెపి డిఎన్‌ఏలోనే జాతీయవాదం ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ వ్యాఖ్యానించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన , జాతీయవాదమే బిజెపికి గుర్తింపని తెలిపారు. బిజెపి అంటేనే జాతీయవాదం, జాతీయవాదమంటేనే బిజెపిఅని రామ్‌ మాధవ్‌ వివరించారు. ప్రధాని మోది నాయకత్వంలో 2022 నాటికి భారతదేశం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతోపాటు, దేశంలోని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా మోది నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. 2047 నాటికి భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/