26/11 గాయాల‌ను భార‌త్ ఎన్న‌టికీ మరిచిపోదు..ప్రధాని

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన మోడి

YouTube video
PM Shri Narendra Modi’s address on Constitution Day.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా శాసన వ్యవహారాల ప్రిసైడింగ్‌ ఆఫీసర్లతో గుజరరాత్‌లో జరిగిన సదస్సులో ప్రసగించారు. ఈ సదర్భంగా మోడి మాట్లాడుతూ.. ఒకేసారి దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం భార‌త్‌కు అవ‌స‌రమ‌ని ప్ర‌ధాని అన్నారు. జ‌మిలి ఎన్నిక‌ల అంశంపై కేవ‌లం చ‌ర్చ మాత్ర‌మే కుద‌ర‌దు అని, ఇప్పుడు ఆ విధానం భార‌త్‌కు ఎంతో అవ‌స‌రమ‌ని ఆయ‌న అన్నారు. మ‌న రాజ్యాంగంలో ఎన్నో అంశాలు ఉన్నాయ‌ని, అయితే విధులు నిర్వ‌ర్తించ‌డ‌మే కీల‌క‌మైన అంశ‌మ‌ని ప్రధాని తెలిపారు. విధుల నిర్వ‌హ‌ణపై మ‌హాత్మా గాంధీ చాలా ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టార‌ని, హ‌క్కులువిధుల మ‌ధ్య స‌న్నిహిత సంబంధం ఉంద‌ని గాంధీ గుర్తించార‌ని ఆయ‌న తెలిపారు. మ‌నం మ‌న విధుల‌ను నిర్వ‌ర్తిస్తే, అప్పుడు మ‌న హ‌క్కులు ఆటోమెటిక్‌గా ర‌క్షింప‌బ‌డుతాయ‌ని ప్ర‌ధాని తెలిపారు.

26/11 మారణ హోమాన్ని ఎన్నటికీ మరిచిపోమని ప్రధాని అన్నారు. 2008 లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ముంబయిపై దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. నేటి భారతం కొత్త పంథాతో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాడుతున్న భద్రతా బలగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. 26/11 మారణహోమంలో అసువులు బాసిన వారికి ప్రధాని మోడి ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/