ఐఐటీ ఖరగపూర్‌ 66వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని

PM Shri Narendra Modi addresses 66th Convocation of IIT Kharagpur.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ 66వ స్నాత‌కోత్స‌వంలో పాల్గొన్నారు. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా ఆయ‌న విద్యార్థుల‌ను ఉద్దేశిస్తూ ప్ర‌సంగించారు. 21వ శ‌తాబ్ధంలో భార‌త్ చాలా మారింద‌న్నారు. ఐఐటీ అంటే ఇండియ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మాత్ర‌మే కాదు అని, అవి ఇన్స్‌టిట్యూట్స్‌ ఆఫ్ ఇండీజీన‌స్ టెక్నాల‌జీలుగా మారాల‌ని అని మోడి అభిప్రాయ‌ప‌డ్డారు. విద్యార్థుల్లో ఆత్మ‌విశ్వాసం, అవగాహ‌న‌, నిస్వార్థం ఉండాల‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిపై దృష్టి పెట్టి, భ‌విష్య‌త్తుకు అవ‌స‌ర‌మైన రీతిలో త‌యారుకావాల‌న్నారు. ప‌దేళ్ల త‌ర్వాత అవ‌స‌రం వ‌చ్చే అంశాల‌ను ఆవిష్క‌రించాల‌న్నారు. స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుంటే.. దీర్ఘ‌కాలిక ప‌రిష్కారాలు దొరుకుతాయ‌న్నారు. అర్థం చేసుకునే త‌త్వం వ‌ల్లే.. కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రుగుతాయ‌న్నారు. వైఫ‌ల్యాలే శాస్త్ర‌వేత్త‌ల‌కు కొత్త దారులు క‌ల్పించాయ‌ని, విజ‌యానికి అవే బాట‌లు వేశాయ‌న్నారు. 21వ శ‌తాబ్ధంలో భార‌త్ ఆశ‌యాలు, అవ‌స‌రాలు మారిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/