కేదార్‌నాథ్‌ లో ప్రధాని మోడి పూజలు

Modi
Modi

డెహ్రాడూన్‌: ప్రధాని మోడి ఈరోజు చార్‌ధామ్‌ యాత్రల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న మోదీ.. అక్కడి నుంచి కేదార్‌నాథ్‌ వెళ్లారు. కేదారీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మోడి రెండు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ఆదివారం బద్రీనాథ్‌ ఆలయాన్ని కూడా మోడి సందర్శించనున్నారు. చివరి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు మోడి కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకోవడం ఆసక్తిగా మారింది. ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలోనూ రేపు ఎన్నిక జరగనుంది.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/