కరోనాపై సిఎంలతో ప్రధాని మోడి సమావేశం

వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాల్లో కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాట్లు చేయాలి..ప్రధాని

YouTube video
PM Narendra Modi’s closing remarks at virtual meeting with CMs on COVID-19

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి కరనా కట్టడి, వ్యాక్సినేషన్‌ భవిష్యత్తు కార్యచరణపైఐ పలు రాష్ట్రాల సిఎంలతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహంచారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే రికవరీ, తక్కువ మరణాల రేట్లతో భారత్‌ ఇతర దేశాల కంటే మెరుగైనా స్థితిలో ఉందని మోడి ప్రశంసించారు. అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు టీకాల‌ను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని మోడి సూచించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న క‌రోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై జ‌రుగుతున్న అన్ని అంశాల‌ను ట్రాక్ చేస్తున్నామ‌ని, భార‌తీయ టీకా అభివృద్ధిదారులు, ఉత్ప‌త్తిదారుల‌తో నిరంత‌రం సంప్ర‌దింపులు చేస్తున్నామ‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా గ్లోబ‌ల్ రెగ్యులేట‌ర్ల‌తోనూ ట‌చ్‌లో ఉన్నామ‌ని, ఇత‌ర దేశ ప్ర‌భుత్వాల‌తో, బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌తో, అంత‌ర్జాతీయ కంపెనీల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ప్ర‌ధాని మోడి తెలిపారు.

ప్ర‌స్తుతం టీకా అభివృద్ధి జ‌రుగుతున్నా.. ఆ టీకాలు ఎన్ని డోసులు ఉంటాయో తెలియ‌వ‌ని, క‌రోనా టీకా ఒక డోసా లేక రెండు డోసులా లేక మూడు డోసుల్లో వ‌స్తుందా ఇప్పుడే చెప్ప‌లేమ‌ని ప్ర‌ధాని మోడి అన్నారు. కరోనా వ్యాక్సిన్‌కు ఇంకా ధ‌ర‌ను కూడా నిర్ధారించ‌లేద‌న్నారు. ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు ఇంకా స‌మాధానం లేద‌ని, కానీ వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన కార్యాచ‌ర‌ణ మాత్రం రూపొందిస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. వ్యాక్సిన్ నిల్వ‌ల కోసం కోల్డ్ స్టోరేజ్‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలే ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. అతి సూక్ష్మ‌స్థాయిలోనూ ఎలా వ్యాక్సిన్ పంపిణీ చేప‌డుతారో.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ పూర్తి ప్ర‌ణాళిక‌ల‌ను పంపించాల‌ని సిఎంల‌ను ప్ర‌ధాని కోరారు. మీరు అనుభ‌వ‌పూర్వ‌కంగా ఇచ్చే అమూల్య‌మైన అభిప్రాయాలు.. తాము నిర్ణ‌యం తీసుకోవ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంద‌ని మోడి అన్నారు. ప్రో యాక్టివ్ భాగ‌స్వామ్యాన్ని స్వాగ‌తిస్తామ‌న్నారు. టీకా అభివృద్ధి ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని, కానీ రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించ‌రాదు అని సిఎంల‌ను మోడి కోరారు. ప్ర‌తి ఒక పౌరుడికి వ్యాక్సిన్ అందించ‌డం కోసం జాతీయ మిష‌న్‌ చేప‌డుతామ‌న్నారు. అయితే ఈ మిష‌న్ స‌క్సెస్ కావాలంటే, అన్ని రాష్ట్రాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌న్నారు. వ్యూహాత్మ‌కంగా, స్మూత్‌గా, నిరంత‌ర ప్ర‌క్రియ‌లా ఈ మిష‌న్‌ను చేప‌ట్టాల‌ని మోడి అన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/