‘పీఎం న‌రేంద్ర మోది’ ట్రైల‌ర్ విడుద‌ల‌

pm narendra modi trailer
pm narendra modi trailer


బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ఒమంగ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పీఎం న‌రేంద్ర‌మోదీ. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నామ‌ని నిర్మాత సందీప్ ఎస్ సింగ్ అన్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. ఇటీవ‌ల మోదీ (వివేక్‌)కి
సంబంధించి విభిన్న గెట‌ప్స్‌లో ఉన్న తొమ్మిది లుక్స్ విడుద‌ల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని సన్నివేశాలు క‌మ‌ర్షియ‌ల్ సినిమా స్టైల్ మాదిరిగానే ఉన్నాయి. ట్రైల‌ర్‌లో మోదీ బాల్యంతో పాటు రాజ‌కీయ ప్ర‌వేశం, గోద్రా అల్ల‌ర్లు త‌దిత‌ర అంశాల‌ని చూపించారు.