‘జన్‌జాతీయ గౌరవ్ దివస్‌’ మహాసమ్మేళనంలో పాల్గొన ప్రధాని

YouTube video
PM Narendra Modi takes part in Janjatiya Gaurav Diwas Mahasammelan in Bhopal, Madhya Pradesh

భోపాల్: భోపాల్‌లో సోమవారం నిర్వహించిన ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్‌’ మహాసమ్మేళనంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈసందర్బంగా ప్రధాని మాట్లడుతూ ..గిరిజనుల సంక్షేమాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని అన్నారు. గత పాలకుల హయాంలో వెనుకబడిన ప్రాంతాలుగా మిగిలిపోయిన వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15వ తేదీని ఇకనుంచి ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్‌’గా కేంద్రం నిర్వహిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి తరహాలోనే భగవాన్ బిర్సా ముండా జయంతిని ఏటా నవంబర్ 15న నిర్వహిస్తామని అన్నారు. స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత జరుపుతున్న తొలి ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్’ ఇదని పేర్కొన్నారు.

‘గిరిజనులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కనీన సౌకర్యాలకు కూడా వారు నోచుకోలేదు. గత ప్రభుత్వ (కాంగ్రెస్) హయాలంలో వెనుకబడిన ప్రాంతాలకు గానే మిగిలిపోయిన 100 జిల్లాల్లో ఇప్పుడు అభివృద్ధి పట్టాలెక్కుతోంది’ అని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. స్వాంతంత్ర్య వచ్చిన తర్వాత జరుపుతున్న తొలి జన్‌జాతీయ గౌరవ దివస్ ఇదని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం, జాతి నిర్మాణంలో గిరజన కళలు, సంస్కృతి, వారి సేవలు ప్రశంసనీయమని. గోండుల రాణి దుర్గవతి సాహసం కానీ, రాణి కమలాపతి త్యాగం కానీ దేశం ఎప్పటికీ మరిచిపోదని అన్నారు. సాహసవంతులైన భిల్ల జాతి గిరిజనులు లేకుండా వీర మహారాణా ప్రతాప్ పోరాటం ఊహించడం కూడా సాధ్యం కాదని అన్నారు. గత ప్రభుత్వాలు గిరిజన ప్రముఖులను, వారి సేవలను నిర్లక్ష్యం చేసిందని, గిరిజన సమాజం సేవలను దేశానికి చెప్పలేదని, పరిమిత సమాచారం మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. జన్‌జాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళనంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. పెద్దఎత్తున ప్రజానీకం హాజరయ్యారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/