అందమైన దృశ్యం షేర్‌ చేసిన ప్రధాని మోడి

వర్షంలో సూర్య‌దేవాల‌యం వీడియో

అందమైన దృశ్యం షేర్‌ చేసిన ప్రధాని మోడి
PM Narendra Modi shares mesmerizing video of Sun Temple in Modhera

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి త‌న ట్విట్టర్ ఖాతాలో ఒక అందమైన వీడియోను షేర్ చేశారు. గుజరాత్‌లోని ప‌లు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఫ‌లితంగా నదులు నిండుకుండ‌లా తొణికిస‌లాడుతున్నాయి. భారీగా వర్షం కురుస్తుండ‌టం, ఆల‌యంలోని మెట్ల మీదుగా నీరు ప్ర‌వ‌హిస్తుండ‌టాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. వర్షంలో సూర్యదేవాలయం ఎంతో అందంగా కనిపిస్తున్న‌ద‌ని మోడి రాశారు. ఈ సూర్య‌దేవాల‌యం మెహ‌సానా జిల్లాలోని మొధెరా గ్రామంలోని పుష్పవతి నది ఒడ్డున ఉంది. ఈ సూర్య దేవాలయం ప్రత్యేకమైన నిర్మాణ‌శైలికి ప్ర‌తీక‌గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ ఆలయంలో పూజలు జరగట్లేదు. కాకపోతే దీన్ని భారత పురావస్తు శాఖ సంరక్షిస్తోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/