లాక్‌డౌన్‌ ఎందుకు విధించారో అర్థం చేసుకోవాలి

లాక్‌డౌన్‌ నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ముప్పు పెరుగుతుంది..ప్రధాని మోడి

pm modi
pm modi

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ పట్ల పై ప్రధాని మోడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ పై నిర్లక్ష్యం వహించరాదని ఎందుకు విధించారో అర్థం చేసుకోవాలని సూచించారు. దీన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించి ఆచరించాలని పిలుపునిచ్చారు. మన భద్రత కోసమే లాక్‌డౌన్‌ ప్రకటించామని ట్వీట్లు చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా సామాజిక దూరాన్ని పాటించాలని మోడి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ నియమాలను కచ్చితంగా అమలు చేయాలని, లాక్‌డౌన్‌పై అలక్ష్యం చేస్తే భవిష్యత్తులో ముప్పు పెరుగుతుందని గుర్తించాలని చెప్పారు. దేశ క్షేమం కోసం లాక్‌డౌన్‌ పాటించాలని ప్రజలను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని మోడి తెలిపారు. ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ అనుభవాలను మర్చిపోవద్దని, మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవండని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తించాలని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/