కూనో పార్క్‌లోకి చీతాలను విడుదల చేసిన ప్ర‌ధాని మోడీ

YouTube video

గ్వాలియ‌ర్ః ప్ర‌ధాని మోడీ నేడు నమీబియా నుండి తెచ్చిన 8 చీతాల‌ను కూనో పార్క్‌లోకి రిలీజ్ చేశారు. ప్ర‌త్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియ‌ర్‌కు ఇవాళ ఉద‌యం చేరుకున్నాయి. ఆ త‌ర్వాత వాటిని ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ల‌లో కూనో ఫారెస్ట్‌కు త‌ర‌లించారు. కాసేప‌టి క్రితం మోడీ ఆ చీతాల‌ను పార్క్‌లోకి విడుద‌ల చేశారు. అనంతరం మోడియే స్వయంగా కెమెరాతో వాటి ఫోటోలు తీశారు. ఈ కార్యక్రమంలో ప్ర‌ధాని వెంట మధ్య్రపదేశ్‌ సిఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ఉన్నారు. ప్ర‌ధాని మోడీ ఇవాళ 72వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చీతాల‌ను విడుద‌ల చేశారు. దీంతో భార‌త్‌లో దాదాపు 70 ఏళ్ల త‌ర్వాత చీతాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

కాగా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షియోపూర్ జిల్లాలో కూనో జాతీయ పార్క్ ఉంది. 8 చీతాల‌కు రేడియో కాల‌ర్ల‌ను ఇన్‌స్టాల్ చేశారు. వాటిని శాటిలైట్ ద్వారా మానిట‌ర్ చేయ‌నున్నారు. పార్క్‌లో కూడా మానిట‌రింగ్ బృందాల‌ను ఏర్పాటు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/