తొలి విదేశి పర్యటనకు వెళ్లనున్న మోడి..!

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్రమోడి ఈనెల 30వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడి ద‌క్షిణాసియా దేశం మాల్దీవుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. జూన్ 78వ తేదీల్లో ఈ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. వ‌రుస‌గా రెండోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మోదీ తొలి విదేశీ ప‌ర్య‌ట‌న ఇదే కావ‌డం విశేషం. జూన్ మొద‌టివారంలో భార‌త ప్ర‌ధాని మాల్దీవుల రాజ‌ధాని మాలే రానున్నార‌ని ఆదేశ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. దీనిపై ఆదేశ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. అయితే ద్వైపాక్షిక సంబంధాల బ‌లోపేతం చేసుకోవ‌డం ల‌క్ష్యంగా ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని భార‌త విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/