ఆర్మీ జవాన్లతో ప్రధాన మోడి దీపావళి
జైసల్మేర్‌లో సైనికులతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని

న్యూఢిల్లీ: నరేంద్రమోడి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లో ఉన్న సైనికులతో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి మోడి దీపావళి వేడుకలను రాజస్థాన్‌లో నిర్వహించనున్నారు. జైసల్మేర్‌లో ఉన్న సైనికులతో ఆయన సెలబ్రేట్ చేసుకోనున్నారు. అయితే జైసల్మేర్‌లో జవాన్లను కలిసేవారిలో మోడితో పాటు సీడీఎస్ బిపిన్ రావత్ కూడా ఉంటారు. గతంలో ప్రధాని మోడి.. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో ఉన్న సైనికుల్ని దీపావళి వేళ కలిశారు. జవాన్లకు మోడి స్వీట్లు షేర్ చేశారు. గత ఏడాది రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఆర్మీ దళాలతో మోడి దీపావళి జరుపుకున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/