అమెరికాలో ప్ర‌జాస్వామ్య స‌ద‌స్సుకు ప్రధానికి ఆహ్వానం

న్యూఢిల్లీ : వ‌చ్చే నెల‌లో అమెరికాలో జ‌ర‌గ‌నున్న ఒక కీల‌క స‌మావేశానికి హాజ‌రు కావాల్సిందిగా ప్ర‌ధాని మోడీకి ఆహ్వానం అందింది. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ నిర్వ‌హిస్తున్న స‌మావేశ‌మ‌ది. ప్ర‌జాస్వామ్యం కోసం స‌ద‌స్సు పేరిట ఆ స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నారు. అయితే ప్ర‌ధాని మోడీ అమెరికా వెళ్ల‌క‌పో్వ‌చ్చు.

వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన‌వ‌చ్చు. రెండు రోజుల పాటు స‌మావేశం ఉంటుంది. డిసెంబ‌రు 9,10 తేదీల్లో జ‌రిగే ఈ స‌ద‌స్సులో వివిధ దేశాధిప‌తులు, పౌర స‌మాజాలు, ప్ర‌యివేటు రంగ నిపుణులకు ఆహ్వానాలు పంపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జాస్వామ్యానికి ఎదుర‌వుతున్న క‌ష్ట‌న‌ష్టాల‌ను, స‌మ‌స్య‌ల‌ను, బెదిరింపుల‌ను స‌మ‌గ్రంగా చ‌ర్చించి, వాటికి నివార‌ణోపాయాల‌ను క‌నుగొని, ఒక నిశ్చిత ఎజెండాను త‌యారుచేయాల‌న్న సంక‌ల్పంతో జోబైడెన్ ఈ భారీ స‌మావేశాన్ని సంక‌ల్పించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/