సోమనాథ్‌లో కొత్త సర్క్యూట్ హౌస్‌ను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Narendra Modi inaugurates new Circuit House at Somnath in Gujarat

న్యూఢిల్లీ: నేడు గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సుప్రసిద్ధ సోమనాథ దేవాలయం వద్ద కొత్తగా నిర్మించిన సర్క్యూట్ హౌస్‌ను ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడారు. స్వాతంత్ర్యానంతరం నూతన నిర్మాణాలు కేవలం ఢిల్లీలోని కొన్ని కుటుంబాల కోసం మాత్రమే జరిగాయని, తన ప్రభుత్వం ఈ సంకుచిత ఆలోచనా ధోరణి నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చిందని చెప్పారు. జాతీయ ప్రాధాన్యంగల నూతన నిర్మాణాలను తన ప్రభుత్వం చేపట్టిందన్నారు. మన మతపరమైన, సాంస్కృతికపరమైన వారసత్వం గురించి మాట్లాడాలంటే గతంలో సందేహం ఉండేదన్నారు. మన పూర్వీకులు మనకు అనేక విషయాలను అందజేశారన్నారు. అయితే మన సుసంపన్నమైన మత, సాంస్కృతిక వారసత్వం గురించి మాట్లాడాలంటే సందేహం ఉండేదన్నారు.

స్వాతంత్ర్యానంతరం కేవలం ఢిల్లీలోని కొన్ని కుటుంబాల కోసం మాత్రమే నూతన నిర్మాణాలు జరిగాయన్నారు. తాము ఈ సంకుచిత భావం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చామన్నారు. జాతీయ ప్రాధాన్యంగల నూతన కట్టడాలను నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్నవాటికి మెరుగులు దిద్దుతున్నామని చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే పరిశుభ్రత, సదుపాయాలు, పర్యాటకుల సమయం పట్ల గౌరవభావం, ఆధునిక దృక్పథం ఉండాలన్నారు. మతపరమైన, వారసత్వ ప్రాధాన్యంగల ప్రదేశాలను అభివృద్ధి చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/