సీఎం జగన్‌కు బర్త్‌డే విషెష్‌ చెప్పిన ప్రధాని మోడీ

pm modi & cm jagan
pm modi & cm jagan

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ప్రధాని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్‌కు విషేష్‌ చెబుతూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇంకా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి జగన్‌కు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కాగా సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు చేనేత కార్మికుల కష్టాల్ని తొలగించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న వైఎస్‌ఆర్‌ నేతన్న పథకాన్ని కూడా సీఎం ఇవాళ ప్రారంభించనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/