పశ్చిమబెంగాల్‌లో ప్రధాని ఏరియల్‌ సర్వే

అంఫాన్‌ తుపాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న సిఎం మమతా

PM Narendra Modi And West Bengal CM Mamata Banerjee Conduct aerial-survey

కోల్‌కతా: ప్రధాని నరేంద్రమోడి పశ్చిమబెంగాల్‌లో ఏరియల్‌ సర్వే జరిపారు. మోడి మ్యాప్ చూస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు. అంఫాన్‌ తుపాను కారణంగా పశ్చిమబెంగాల్‌లో తీవ్ర విధ్వంసం జరిగింది. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల ఎకరాల్లో పంటపొలాలు దెబ్బతిన్నాయి. పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. తీర ప్రాంతం వెంబడి అనేక చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. అయితే అంఫాన్‌ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని మమత డిమాండ్ చేశారు. ఈఏరియల్‌ సర్వేలో ప్రధాని మోడితో పాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, బాబుల్ సుప్రియో, ప్రతాప్ సారింగి కూడా ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లో పర్యటించాక ప్రధాని ఒడిశాలోనూ పర్యటిస్తారు. సిఎం నవీన్ పట్నాయక్‌తో కలిసి ఏరియల్ సర్వే జరిపే అవకాశం ఉంది. నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేశాక రెండు రాష్ట్రాలకూ ప్రధాని ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/