రెండో రోజు సమావేశమైన మోడి, జిన్‌పింగ్‌

PM modi -Xi-Jinping
PM modi -Xi-Jinping

చెన్నె: చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌తో భారత ప్రధాని నరేంద్రమోడి రెండో రోజు సమావేశమయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలోని కోవలంలో ఈరోజు భేటి అయ్యారు. ఈ ఉదయం కోవలంలోని తాజ్‌ ఫీషర్‌మ్యాన్స్‌ కోవ్‌ హోటల్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌కు మోడి స్వాగతం పలికారు. తరువాత బ్యాటరీ కారులో ఇద్దరు ప్రయాణించి సమావేశ గదికి చేరుకున్నారు. అధికార లాంఛనాలు లేకుండా కులాసా వాతావరణంలో మోడి, జిన్‌పింగ్‌ సమావేశమయ్యారు. ఈ భేటిలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ భేటి అనంతరం ప్రతినిధి బృందం స్ధాయి చర్చలు జరుగుతాయి. తర్వాత రెండు దేశాల అధికారులు విడివిడిగా ప్రకటనలు వెలువర్చనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/