6లక్షల మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాం

కరోనాపై ప్రతిరోజు ప్రధాని మోడీ పర్యవేక్షణ

prakash javadekar
prakash javadekar

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. దేశంలోని 21 ఎయిర్‌పోర్టుల్లో మొత్తం 6లక్షల మందికి కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కేబినెట్‌ బేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎయిర్‌పోర్టులతో పాటు నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌ దేశాల నుంచి సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశించిన 10 లక్షల మందికి కూడా స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతం పుణెలో మాత్రమే వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఉందని జవడేకర్‌ తెలిపారు. మరో 15 ల్యాబ్‌లు, 19 అదనపు కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పనుందని చెప్పారు. కొన్ని దేశాలకు వీసా-అరైవల్‌ సదుపాయాన్ని నిలిపివేసినట్లు జవడేకర్‌ వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/