మోడి ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్రమోడి మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరు కానున్న అతిథుల జాబితా చాలా ఘనంగా ఉంది. ప్రపంచ స్థాయి నేతలు, అత్యున్నత సంస్థల అధినేతలు, వ్యాపారం, సినిమా, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయని సమాచారం.
భారత ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, రతన్‌ టాటా, అజ§్‌ు పిరమాల్‌, మాజీ స్ప్రింటర్‌ పీటీ ఉష, క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, హర్భజన్‌ సింగ్, బాడ్మింటన్ స్టార్‌ సైనా నెహ్వాల్, కోచ్‌ పుల్లెల గోపీ చంద్‌, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, తదితరులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. కంగనా రనౌత్, షారుక్‌ ఖాన్‌, సంజయ్‌ లీలా బన్సాలీ, కరణ్ జోహార్, రజనీ కాంత్‌ వంటి సినీ ప్రముఖులు అతిథుల జాబితాలో ఉన్నారు.
సిస్కో సిస్టమ్స్‌ మాజీ సీఈఓ జాన్‌ చాంబర్స్‌, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఇంటర్ననేషనల్ మానిటర్‌ ఫండ్ డైరెక్టర్‌ క్రిస్టినా లగార్డే వంటి అంతర్జాతీయ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. వీరితో పాటు బిమ్స్‌టెక్‌ ప్రతినిథులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/