ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధాని మోడీ ప్రసంగం

PM Modi’s Speech at interaction with IPS Probationers of 2019 batch

న్యూఢిల్లీ : సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో వర్చువల్ సమావేశంలో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మాట్లాడారు. భారత దేశంలో పోలీసు వ్యవస్థపై వ్యతిరేక అభిప్రాయం ఉందని, ఈ వ్యవస్థ ప్రతిష్ఠను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభంలో ఈ వ్యతిరేక ప్రజాభిప్రాయం తాత్కాలికంగా మారిందని చెప్పారు. అయితే మళ్ళీ పాత పరిస్థితులే పునరావృతమవుతున్నాయన్నారు.

భారత దేశం ప్రస్తుతం చరిత్రలో చాలా ముఖ్యమైన దశలో ఉందని చెప్పారు. ఇటువంటి సమయంలో పోలీసులు తమ వ్యవస్థ పేరు, ప్రతిష్ఠలు మెరుగుపడటానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్)ను ఉదాహరణగా చూపించారు. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది అందజేసే సేవలపై ప్రజలకు గొప్ప నమ్మకం ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా ఐపీఎస్ ట్రైనీలు పోలీస్ అకాడమీలో తమ అనుభవాలను మోడి కి వివరించారు. ప్రొబేషనర్లతో మోడి మాట్లాడుతూ వారి అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ అధికార పరిధిలోని భద్రతా పరిస్థితులతో ఏ విధంగా వ్యవహరించాలనుకుంటున్నదీ అడిగారు. వ్యక్తిత్వ లక్షణాలు, నేపథ్యాల నుంచి వచ్చిన అనుభవం వంటివాటిని ఉపయోగించి ఏ విధంగా పని చేస్తారో అడిగి తెలుసుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/