మీలా ఆలోచిస్తే సమస్యలు ఇప్పటికీ అలాగే ఉండేవి

సవాళ్లకు తలొగ్గకుండా ముందుకెళ్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ మాదిరిగా ఆలోచించి ఉంటే దేశంలో ఇప్పటికీ అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయేవంటూ లోక్‌సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. సవాళ్లకు తలొగ్గకుండా ముందుకెళ్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ పేరుతో ముస్లిం మహిళలను భయపెట్టారనీ..కాంగ్రెస్‌ బాటలో వెళ్తే ట్రిపుల్‌ తలాక్‌ సమస్య ఇప్పటికీ అలాగే ఉండేదని అన్నారు. ఇంకా అయోధ్యలో రామమందిరం వివాదం మీలా ఆలోచిస్తే ఇప్పటికీ కొనసాగేదని విమర్శించారు. జమ్మూ కశ్మీర్‌ ప్రజల కష్టాలు కూడా అలాగే ఉండేవి అని గుర్తు చేశారు. ప్రభుత్వమే కాదు..పాలనలోనూ ప్రజలు మార్పుకోరుకున్నారని ప్రధాని తెలిపారు. 70 ఏళ్ల పాటు 370 ఆర్టికల్‌ అలాగే కొనసాగింది. అయితే దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని ఇలాంటి ఎన్నో సమస్యలను మేము పరిష్కరించామని ప్రధాని పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/