పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు

సమావేశాలను దేశప్రయోజనాల కోసం ఉపయోగించుకుందాంః ప్రధాని

YouTube video
PM Modi’s remarks at the start of the Monsoon Session of Parliament

న్యూఢిల్లీః నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడి ప్రసంగించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవి అన్నారు. సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలన్నారు. ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగమని అన్నారు. దేశంలో కొత్తశక్తిని పెంపొందించేందుకు.. పార్లమెంటు సభ్యులు మాద్యమంగా మారాలని పిలుపిచ్చారు. వచ్చే 25 ఏళ్ల భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన సమయమిదని పేర్కొన్నారు. సభ్యులందరూ ఉభయసభల్లో లోతైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడి కోరారు. ఈ సమావేశాల్లోనే కొత్త రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికవుతారని.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. సమావేశాలను దేశప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామన్న మోడి.. పార్లమెంట్‌లో చర్చలు, విమర్శలు అర్థవంతంగా జరగాలని ఆకాంక్షించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/