జ‌పాన్ లో క్వాడ్ సదస్సులో పాల్గొన్న ప్ర‌ధాని మోడీ

ఇండో ప‌సిఫిక్ కోసం నిర్మాణాత్మ‌క ఎజెండాతో క్వాడ్ ముందుకు వెళుతోందని వ్యాఖ్య‌

YouTube video
PM Modi’s Remarks At the Quad Leaders Meeting in Tokyo l PMO

టోక్యో: భార‌త ప్ర‌ధాని మోడీ జ‌పాన్ లో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జ‌రుగుతోన్న‌ ఈ స‌మావేవ‌శంలో క్వాడ్ దేశాల అధినేత‌లు పాల్గొన్నారు. మోడీతో పాటు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్, జ‌పాన్ ప్ర‌ధాని కిషిదా, ఆస్ట్రేలియా ప్ర‌ధాని అల్బ‌నీస్ ఈ స‌మావేశంలో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇండో ప‌రిఫిక్ ప్రాంతంలో ప‌రిణామాలు, అంత‌ర్జాతీయ అంశాల‌పై వారు చ‌ర్చిస్తున్నారు.

అలాగే, ప్ర‌ధానంగా ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధం, క్వాడ్ దేశాల‌తో చైనా సంబంధాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. స్వేచ్ఛాయుత ఇండో ప‌రిఫిక్ కోసం క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని నాలుగు దేశాల అధినేత‌లు స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా భార‌త ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ… క్వాడ్ దేశాల మ‌ధ్య విశ్వాసం ప్ర‌జాస్వామ్య శ‌క్తుల‌కు కొత్త శ‌క్తినిస్తాయని చెప్పారు.

ఇండో ప‌సిఫిక్ కోసం నిర్మాణాత్మ‌క ఎజెండాతో క్వాడ్ ముందుకు వెళుతోందని ఆయ‌న అన్నారు. విస్తృత‌మైన క్వాడ్ ప‌రిధి మ‌రింత ప్ర‌భావ‌వంతంగా మారిందని తెలిపారు. క‌రోనా ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ ప‌లు అంశాల్లో స‌మ‌న్వ‌యం కొన‌సాగించామ‌ని గుర్తు చేసుకున్నారు. కాగా, ఉక్రెయిన్ లో ర‌ష్యా యుద్ధాన్ని ఆపేవ‌ర‌కు భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు సాయం కొన‌సాగుతుంద‌ని అమెరికా చెప్పింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/