జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్న ప్రధాని

మే 2 నుంచి మోడీ పర్యటన ప్రారంభం

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఈ సంవత్సరంలో తొలి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. 3 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. మే 2న ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. తొలుత ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. బెర్లిన్ లో జర్మనీ చాన్సెల్లర్ ఒలాఫ్ షోల్స్ తో ఆయన భేటీ అవుతారు. ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

ఆ తర్వాత ఇద్దరు నేతలు కలిసి ఇండియా, జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ 6వ ఎడిషన్ లో పాల్గొంటారు. ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చిస్తారు. అనంతరం జర్మనీ నుంచి డెన్మార్క్ వెళ్తారు. ఆ తర్వాత మే 4వ తేదీన ప్యారిస్ చేరుకుంటారు. ఈ వివరాలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/