పాక్‌ నుంచి కాకుండా ఒమెన్‌ నుంచి మోది ప్రయాణం

imran khan, modi
imran khan, modi

న్యూఢిల్లీ: భారత ప్రధాని మోది ఎన్‌సిఓ సదస్సుకు పాక్‌ గగనతలం మార్గం నుంచి కాకుండా ఒమెన్‌ మార్గం గుండా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం మోది వివిఐపి విమానంలో ఒమెన్‌, ఇరాన్‌, సెంట్రల్‌ ఆసియా దేశాల గుండా బిష్కెక్‌ చేరుకుంటారు. ప్రధాని తన పర్యటన మార్గం విషయంలో తీసుకున్న తాజా నిర్ణయాన్ని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి.
దీనికి ముందు పాక్‌ గగనతలం మీదుగా మోదీ వెళ్లేందుకు అనుమతించాలని ఆ దేశాన్ని భారత్‌ కోరింది. పాక్‌ సైతం భారత్‌ విజ్ఞప్తిని సూత్రప్రాయంగా అంగీకరించింది. భారత్‌ వాయుసేన దాడుల తర్వాత పాక్‌ తమ గగనతల మార్గాలను మూసివేసింది. కేవలం రెండు మార్గాలను మాత్రమే తెరచిఉంచింది. ఈ రెండు మార్గాల గుండా కాకుండా మూడో మార్గం గుండా మోది వెళ్లేందుకు గగనతల మార్గం తెరవాలని భారత్‌ పాక్‌ను కోరింది. ఇందుకు పాక్‌ సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే. ఇరుదేశాల మధ్య అపరిష్కృత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయనే ఆశాభావం పాక్‌ వ్యక్తం చేసింది. కాని మోది చివరినిమిషంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఒమెన్‌ గుండా తన పర్యటన సాగించాలని నిర్ణయించుకున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/