టెక్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడి

PM Modi virtually inaugurates Bengaluru Technological Summit 2020

బెంగళూరు: బెంగళూరులో ఈరోజు నుండి మూడు రోజులపాటు టెక్‌ సమ్మిట్‌-2020 జరుగనుంది. ఈ ఈ స‌ద‌స్సును ప్ర‌ధాని మోడి ఈరోజు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ స‌దస్సులో ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్, స్విస్‌ కాన్ఫెడరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గై పార్మెలిన్‌తో పాటు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, ప‌రిశోధ‌కులు, ఆవిష్క‌ర్త‌లు, విద్యావేత్త‌లు పాల్గొన్నారు. అనంతరం ప్రధాని క‌రోనా త‌ర్వాత మాన‌వాళికి ఎదుర‌య్యే స‌వాళ్లు, ఐటీ, బ‌యోటెక్నాల‌జీ అంశాల‌పై ప్రసంగించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/