స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

PM Modi unveils statue of Jaincharya Shri Vijay Vallabh Surishwer Ji Maharaj

జైపూర్‌: ప్రధాని నరేంద్రమోడి రాజస్థాన్‌ పాళిలో జైనా ఆచార్యుడు విజయ్‌ వల్లభ్‌ సురేశ్వర్‌ విగ్రహాన్ని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. గుజరాత్‌ భూమి ఇద్దరు వల్లబ్‌లను ఇచ్చిందని నిత్యానంద్‌ సురేశ్వర్‌ చెప్పేవారన్నారు. ఒకరు రాజకీయ రంగంలో సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌, ఆధ్యాతిక రంగంలో జైనా ఆచార్యుడు విజయ్‌ వల్లబ్‌ దేశం ఐక్యత, సోదరభావం కోసం ఇద్దరు తమ జీవితాలను అంకితం చేశారని కొనియాడారు. సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం(స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ)తో పాటు స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. రాజస్థాన్‌ రాష్ట్రం పాళీలోని జెట్‌పురాలోని విజయ్‌ వల్లభా సాధన కేంద్రంలో విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. 151 అంగుళాల పొడవు ఉన్న విగ్రహాన్ని.. అష్టధాతువుల (ఎనిమిది లోహాలు)తో తయారు చేయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/