భూటాన్‌ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడి

modi
modi

న్యూఢిల్లీ: ప్రధాని మోడి రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ వెళ్లనున్నారు. భూటాన్ ప్రధాని లొటయ్ త్సెరింగ్‌ ఆహ్వానం మేరకు మోడి అక్కడికి వెళ్లనున్నారు. భారత్‌కు నమ్మకమైన మిత్రుడిగా, పొరుగుదేశంగా భూటాన్‌కు పేరుంది. భూటాన్‌తో స్నేహానికి భారత్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం ప్రతిబింబించేలా ప్రధాని పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యంగ అన్న తన విధానంలో భాగంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే మోడి భూటాన్ వెళ్లనుండడం విశేషం.

తన పర్యటన సందర్భంగా ప్రధాని మోడి భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యేల్ వాంగ్చుక్, మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌లతో పాటు భూటాన్ ప్రధాని త్సెరంగ్‌తో సమావేశమైన చర్చలు జరపనున్నారు. కాగా ఈ నెల 17న మోడి భూటాన్‌కు వెళ్లనున్నారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/