నేడు బెంగాల్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు పశ్చిమ బెంగాల్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు ఆ రాష్ట్ర బిజెపి శాఖ విస్తృతమైన ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి పోలింగ్‌ బూత్‌లో ప్రధాని మోడి వర్చువల్‌ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సంకల్పించింది. సుమారు 78వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాల్లోని ప్రతి బూత్‌లో 25 మందికిపైగా పార్టీ కార్యకర్తలు, ఓటర్లు ప్రసంగాన్ని వినేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని ఖపూజోర్ శుబేచాగ (పూజా శుభాకాంక్షలు), కరోనా నేపథ్యంలో మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర అంశాలపై ఆ రాష్ట్ర ప్రజలతో అభిప్రాయాలను పంచుకోనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/