ఈ రంగంలో భారత్‌ వాటాను పెంచాలి..ప్రధాని

ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్‌ ఉంది..ప్రధాని నరేంద్ర మోడి

PM Shri @Narendra Modi interacts with participants of Toycathon-2021

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ టాయ్‌ కథాన్‌-2021 వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ..దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. ఈ రంగంలో భారత్‌ వాటాను పెంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశం కోట్లాది రూపాయల విలువైన 80 శాతం బొమ్మలను దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చడం ముఖ్యమన్నారు. ప్రపంచ బొమ్మల మార్కెట్‌లో సుమారు వంద బిలియన్‌ డాలర్ల వాటా కాగా.. భారత్‌ వాటా 1.5 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉందన్నారు. ఈ సందర్భంగా బొమ్మల ప్రాముఖ్యతను తెలిపారు. ‘పిల్లల మొదటి పాఠశాల కుటుంబమైతే.. తొలి పుస్తకం, మొదటి నేస్తాలు బొమ్మలు’ అన్నారు. దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమలకు ఊతమ్వివాలని, ప్రపంచ స్థాయి మార్కెట్‌ను సృష్టించేందుకు కృషిచేయాలన్నారు. ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్‌ ఉంద ఉందన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/