నేడు గోరఖ్‌పూర్‌లో పర్యటించనున్న ప్రధాని

రూ.9వేలకోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీ యూపీలోని ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌తో పాటు ఎరువుల కర్మాగారంతో సహా పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. పర్యటనలో రూ.9600కోట్ల విలువైన జాతీయ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారని పీఎంవో తెలిపింది. గోరఖ్‌పూర్‌లోని ఎయియ్స్‌ ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న బిహార్‌, నేపాల్‌కు సైతం సేవలందించనున్నది. రూ.వెయ్యికోట్లకుపైగా వెచ్చించి ఎయిమ్స్‌ను నిర్మించారు. 2016, జూలై 22న ఎయిమ్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అలాగే అదే రోజు శంకుస్థాపన చేసిన గోరఖ్‌పూర్‌ ఎరువుల కార్మాగాన్ని సైతం ఇవాళ ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 30 సంవత్సరాలకుపైగా మూతపడి ఉన్న ఎరువుల కర్మాగారాన్ని రూ.8,600వేలకోట్లతో పునరుద్ధరించారు. ఈ ప్లాంట్‌లో ఏటా 12.7 ఎల్‌ఎంటీ దేశీయ వేపపూతతో కూడిన యూరియా ఉత్పత్తి చేయనున్నది. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లోని ఐసీఎంఆర్‌ రీజనల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కొత్త భవనాన్ని సైతం ప్రధాని ప్రారంభించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/