సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడి ప్రసంగం

modi
modi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌ విభజన, 370 అధికరణను రద్దు చేస్తూతీసుకున్న చారిత్రక నిర్ణయాలతో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో కశ్మీర్‌ విషయాన్ని యావత్‌ ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాని మోడి ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారట. నేడు సాయంత్రం 4 గంటలకు మోడి ప్రసంగం ఉంటుందని ఆల్‌ ఇండియా రేడియో ట్వీట్‌ చేసింది. ఇంద్రప్రస్థా, ఎఫ్‌ఎం రెయిన్‌బో, ఎఫ్‌ఎం గోల్డ్‌ ఛానళ్లలోనూ ఈ ప్రసంగాన్ని వినొచ్చని వెల్లడించింది. అయితే కాసేపటికే ఈ ట్వీట్‌ను తొలగించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కొద్ది రోజులకే మోడి జాతినుద్దేశించి ప్రసంగించడంతో కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. 370 అధికరణను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది..? కశ్మీర్‌ను ఎందుకు విభజించాల్సి వచ్చింది..? అనే అంశాలను మోడి ప్రస్తావించే అవకాశాలున్నాయి.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/