నవభారతం కోసం ఓటు వెయ్యాలి..ప్రధాని కోసం కాదు

PM Modi
PM Modi

మహబూబ్‌ నగర్‌: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు పాలమూరులో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రజల ఆశీర్వాదం తనకు అద్భుత శక్తినిచ్చిందని.. మరోసారి పాలమూరుకు వచ్చానని ఆయన అన్నారు.విపక్షాల పాలనను ఎన్నో ఏళ్లు చూశారు. నా పాలన కూడా అరవై నెలలు చూశారు. ఈ 60 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఏప్రిల్ 11న ప్రధానమంత్రి కోసం ఓటు వేయడంలేదు.. నవభారతం కోసం ఓటు వెయ్యాలి. మన ప్రతిభ, ఆత్మవిశ్వాసం ప్రపంచం తెలుసుకోగలుగుతోంది. గతంలో దేశం నలుమూలలా బాంబులు పేలేవి.. అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారు. ప్రస్తుతం సురక్షిత భారతాన్ని అందించాం అంటూ బీజేపీ ఐదేళ్ల పాలన గురించి వివరించారు.అంతకుముందు పాలమూరు ప్రజలందరికీ నా నమఃసుమాంజలులు అంటూ తెలుగులో ప్రసంగించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/