ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపిన మోడి
భారత్ కు వెంటిలేటర్లు పంపిస్తామన్న ట్రంప్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ భారత్‌కు వెంటిలేటర్లను అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈవిషయంపై ప్రధాని మోడి ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారిపై అందరం సమష్టిగా యుద్ధం చేస్తున్నామని, విపత్కర పరిస్థితుల్లో దేశాలన్నీ కలసికట్టుగా పనిచేయడం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. ప్రపంచ మానవాళి కరోనా నుంచి విముక్తం కావాలంటే దేశాలన్నీ శక్తివంచన లేకుండా శ్రమించాలని మోడి పిలుపునిచ్చారు. అంతేకాకుండా, భారత్, అమెరికా మైత్రి మరింత బలోపేతం కావాలని అభిలషించారు. ఈ మేరకు మోడి ట్వీట్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/