మయన్మార్ తో కలిసి కరోనా నివారణకు కృషి చేస్తాం

మయన్మార్ దేశాధినేత ఆంగ్ సాన్ సూకీతో మాట్లాడిన ప్రధాని మోదీ

pm modi
pm modi

న్యూఢిల్లీ :కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈనేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ దేశాధినేత ఆంగ్ సాన్ సూకీతో మాట్లాడారు. దీనిపై ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. ఇరుదేశాల్లో కరోనా వైరస్ భూతం విజృంభిస్తున్న తీరుతెన్నుల పట్ల చర్చించామని తెలిపారు. కరోనా వ్యాప్తి క్రమంలో ఉత్పన్నమవుతున్న సవాళ్లను ఎదుర్కొనే అంశంలో ఐక్యంగా కృషి చేయాలని నిర్ణయించామని వివరించారు. పొరుగుదేశానికి ప్రథమ ప్రాధాన్యత అనే భారత సిద్ధాంతాన్ని మయన్మార్ విషయంలోనూ వర్తింపజేస్తామని, ఇరుదేశాల మధ్య ఉన్న అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళతామని మోదీ పేర్కొన్నారు.

తాజా ఏపీ కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/