మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు ప్రధాని మోడి భుమిపూజ

YouTube video
PM Modi performs Bhoomi Poojan of Ahmedabad Metro Rail Project Phase-II and Surat Metro Rail Project

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని రెండు వేర్వేరు మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు సోమవారం ప్రధాని నరేంద్రమోడి భుమిపూజ చేశారు. అహ్మ‌దాబాద్‌లోని మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్‌2కు, సూర‌త్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా భూమిపూజ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ప్రధాని మట్లాడుతూ.. దేశంలోని రెండు ప్ర‌ధాన వ్యాపార కేంద్రాలైన అహ్మ‌దాబాద్‌, సూర‌త్‌ల‌లో తాజా మెట్రోరైల్ ప్రాజెక్టుల ద్వారా క‌నెక్టివిటీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని పేర్కొన్నారు. అహ్మ‌దాబాద్‌, సూర‌త్‌లకు ఈ నూత‌న మెట్రోరైల్ ప్రాజెక్టులు చాలా ముఖ్య‌మైన బ‌హుమ‌తుల‌ని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/