స్వామి వివేకానందకి నివాళులు అర్పించిన ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నేడు ఆయనకు నివాళులు అర్పించారు. దేశం కోసం ఆయన కన్న కలలను నెరవేర్చడానికి అందరూ కలిసి పని చేయాలని అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు. అతని జీవితం జాతీయ పునరుజ్జీవనానికి అంకితం చేశారు. ఎందరో యువతను దేశ నిర్మాణం వైపు ప్రేరేపించారు. దేశం కోసం ఆయన కన్న కలలను నెరవేర్చడానికి మనం కలిసి పని చేద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

స్వామి వివేకానంద 159వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం 25వ నేషనల్ యూత్ ఫెస్టివల్‌‌ను ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే తన ప్రసంగం కోసం దేశవ్యాప్తంగా యువతీయువకుల నుంచి సలహాలు, సూచనలను కోరారు. యువత సలహాలు, సూచనలను ప్రధాని తన ప్రసంగంలో జోడించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/