కాంగ్రెస్‌, విపక్షాలకు మోడి సవాల్‌..

narendra modi
narendra modi

రాంచీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌తో సహా విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడి సవాల్‌ విసిరారు. మంగళవారం ఝార్ఖండ్‌లోని బెర్‌హైట్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సీఏఏ చట్టంపై ఏ భారతీయ పౌరుడిపై ప్రభావం చూపించదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అనవసరంగా ముస్లింలలో అభద్రతా భావాన్ని నింపుతుందని మోడి విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ దాని మిత్ర పక్షాలకు దమ్ము, ధైర్యం ఉంటే ..ప్రతి పాకిస్థాన్‌ పౌరుడికి భారత పౌరసత్వం ఇవ్వగలమని..అలాగే జమ్మూ కశ్మీర్‌కు తిరిగి ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించగలమని బహిరంగంగా ప్రకటన చేయగలరా అని మోడి సవాల్‌ విసిరారు. ఆయా పార్టీలు దేశంలో కావాలని అసత్యాలు ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాగా కేవలం భారత చుట్టు పక్కల దేశాల్లో హింసకు గరై భారత్‌కు వచ్చిన మైనారిటీల కోసం మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

తాజా ఎపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/