మరోసారి ప్రధానిగా మోడి..తాజా సర్వే

ప్రధాని మోదీకి 66 శాతం, రాహుల్‌కి 8% శాతం ఓట్లు

Narendra Modi
Narendra Modi

న్యూఢల్లీ: ప్రధాని నరేంద్రమోడికి ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉంది. తదుపరి ప్రధానిగా కూడా ఆయనే కొనసాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ప్రధాని విషయంలో మోడికి, రాహుల్ గాంధీకి మధ్య అంచనాకు అందనంత దూరం ఉండడం గమనార్హం. వచ్చేసారి కూడా మోదీనే ప్రధానిగా ఉండాలని 66 శాతం మంది ప్రజలు కోరుకోగా, ఈ విషయంలో కేవలం 8 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓటేశారు. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కేవలం 5 శాతం మందే ఓటు వేయడం గమనార్హం.

ఇండియా టుడేకార్వీ ఇన్‌సైట్స్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట చేపట్టిన ఈ సర్వే తదుపరి ప్రధాని ప్రాధాన్య జాబితాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ప్రియాంక గాంధీ, రాజ్‌నాథ్ సింగ్, ఉద్ధవ్ థాకరే, మాయావతి, అఖిలేశ్ యాదవ్‌కు చోటు లభించింది. అయితే, వీరిలో ఒక్క అమిత్ షా ఒక్కరికే 4 శాతం ఓట్లు రాగా, మిగతా అందరికీ ఆలోపే రావడం గమనార్హం. ఈ ఏడాది జులై 15 నుంచి జులై 27 మధ్య 12,021 మందిని టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ సర్వే నిర్వహించారు.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/