బెర్లిన్‌లో ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ
కాసేపట్లో జర్మనీ ఛాన్సలర్ తో భేటీ

జర్మనీ : భారత ప్రధాని మోడీ జర్మనీ చేరుకున్నారు. బెర్లిన్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి అధికారులు, ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా మోడీ జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాలు సందర్శిస్తారు. ఆయా దేశాల అధినేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. ఐరోపా దేశాలతో బంధాన్ని పటిష్ఠం చేసుకునే దిశగా మోడీ చర్చలు జరపనున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోన్న నేపథ్యంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతుండగా భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోన్న నేపథ్యంలో ఐరోపాలో మోడీ పర్యటిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఐరోపా దేశాలు ఇంధన సమస్యలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో ఈ సమస్యపైనే ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు కాసేపట్లో బెర్లిన్ లో భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సమావేశంలో మోడీ పాల్గొంటారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/