హిమాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని

PM Modi launches development initiatives in Himachal Pradesh

హిమాచల్‌ ప్రదేశ్‌: ప్రధాని నరేంద్ర మోడీ హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈసందర్బంగా ప్రధాని 28,197 కోట్ల విలువైన 287 పెట్టుబడి ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. ధౌలసిద్ధా హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌తో పాటు రేణుకాజీ డ్యామ్‌ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. అనంతరం మండిలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, జలవిద్యుత్ ప్రాజెక్టులు వాతావరణ అనుకూల నవ భారతదేశంలో భాగమని, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఉన్నాయని అన్నారు. అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పర్యావరణ పరిరక్షణకు దేశం చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని మోడీ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/