ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Modi launches Ayushman Bharat Digital Mission

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను సోమవారంనాడు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని గత ఏడాది ఆగస్టు 15 న ఎర్రకోట నుండి ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు.. అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్-డయు, లఢక్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో అమలు చేయనున్నారు.

కాగా, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) మూడవ వార్షికోత్సవం రోజునే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభమవుతుడటం విశేషమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/