అతను ఓ కరడు గట్టిన ఉద్రవాది

pm-modi-is-a-terrorist-says-ap-cm-chandrababu-naidu
pm-modi- cm-chandrababu

చిత్తూరు: ఏపి సిఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ప్రధాని మెడిపై ఘాటైన విమర్శలు చేశారు. మోడి ఓ కరడు గట్టిన ఉగ్రవాది అని, మంచివాడు కాదు అని అనడం విశేషం. అంతేకాక ఈ సభలో ఎప్పుడో జరిగిన గోద్రా అల్లర్ల అంశాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు. మైనారిటీ సోదరులకు ఒక్కటే చెబుతున్నా. మిమ్మల్ని జైళ్లలో వేయడానికి మోదీ ట్రిపుల్ తలాఖ్ బిల్లు తీసుకొచ్చారు. గోద్రా ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. 2 వేల మందిని చంపారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తొలి వ్యక్తిని నేనే అని చంద్రబాబు చెప్పడం గమనార్హం. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే మీకు కష్టాలు తప్పవంటూ మైనారిటీలను బాబు హెచ్చరించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/