అమెరికా సంస్థలకు ప్రధాని మోడి ఆహ్వానం

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికిన ప్రధాని

YouTube video
PM Modi invites US firms to invest in India at USIBC event

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి అమెరికాఇండియా బిజినెస్ కౌన్సిల్ స‌మావేశంలో మాట్లాడుతూ.. ఇండియాలో పెట్టుబడులు పెట్టాల‌ని అమెరికా కంపెనీల‌కు ప్ర‌ధాని మోడి ఆహ్వానం ప‌లికారు. దేశంలోని ఆరోగ్య, మౌళిక‌స‌దుపాయాలు, ర‌క్ష‌ణ, ఎన‌ర్జీ, బీమా, వ్య‌వ‌సాయ రంగాల్లో పెట్టుబ‌డి పెట్టాల‌ని కోరారు. భార‌త దేశం నిష్క‌ప‌టంగా, అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంద‌ని మోడి తెలిపారు. కాగా భార‌తదేశం ప‌ట్ల ప్ర‌పంచ దేశాల్లో విశ్వాసం పెరిగింద‌న్నారు. ఎందుకంటే భార‌తీయులు స్వ‌చ్ఛ‌మైన‌వార‌ని, అవ‌కాశాలు క‌ల్పిస్తార‌ని, ఎన్నో ఆప్ష‌న్లు ఉన్నాయ‌న్నారు. భార‌త దేశ ప్ర‌జ‌ల్లో, ప‌రిపాల‌న‌లోనూ స్వ‌చ్ఛ‌త‌ను సెల‌బ్రేట్ చేసుకుంటార‌ని అన్నారు. కోవిడ్ మ‌హ‌మ్మారి వేళ ఆర్థిక స్వాలంబ‌న అవ‌స‌రం అని, అయితే ఆ స్వాలంబ‌న బ‌ల‌మైన దేశీయ ఆర్థిక సామ‌ర్థాలపై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు.

భార‌త దేశం అవ‌కాశాల‌కు నిల‌యంగా మారుతుంద‌ని ప్ర‌ధాని మోడి అన్నారు. టెక్నాల‌జీ రంగ‌మే దీనికి మంచి ఉదాహ‌ర‌ణ అని తెలిపారు. ఇటీవ‌ల దేశానికి చెందిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన నివేదిక వెల్ల‌డైంద‌న్నారు. దేశంలో ప‌ట్ట‌ణ ఇంటర్నెట్ యూజ‌ర్ల క‌న్నా.. గ్రామీణ ఇంట‌ర్నెట్ యూజ‌ర్లే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు మోడి తెలిపారు. ఓపెన్ మార్కెట్ అంటే.. బోలెడ‌న్న అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే అన్నారు. గ‌త ఆరేళ్ల నుంచి భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ఓపెన్‌గా, సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రంగా మారుస్తున్న‌ట్లు మోడి తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల పోటీత‌త్వం పెరిగింద‌న్నారు. పాద‌ర్శ‌క‌త‌, డిజిటైజేష‌న్‌, ఇన్నోవేష‌న్‌, విధాన స్థిర‌త్వం కూడా పెరిగింద‌ని మోడి తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/